NLG: దేవరకొండలోని గ్రంథాలయంలో తెలంగాణ సాంస్కృతిక, సాహిత్య అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ ప్రజాకవి, వాగ్గేయకారుడు, రాష్ట్ర గీతాన్ని అందించిన మహాకవి డా.అందేశ్రీ స్మరించుకుంటూ నివాళులర్పించారు. అందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. ఆయన ఎన్నో చైతన్యవంతమైన గీతాలు అందించిన గొప్ప కవి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.