MDK: ప్రజలకు మెరుగైన నిరంతర వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఆదివారం చిన్న శంకరం పేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్, మందుల నిల్వలు, స్టాక్ బోర్డు పరిశీలించారు. రోగులతో ముచ్చటించి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.