నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబోలో సినిమా రాబోతుంది. ఈ నెలాఖరున పూజా కార్యక్రమాలతో ఈ మూవీ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఈవెంట్కు AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆయనే ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టనున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.