ELR: నిడమర్రు మండలంలో ఈ నెల 17వ తేదీ నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో విజయకుమారి తెలిపారు. 17,18 తేదీల్లో తోకలపల్లి, 19, 20 తేదీల్లో పీఎన్ కొలను, 21, 22- నిడమర్రు, 24, 25 అడవికోలను, 26వ తేదీన బావాయిపాలెం సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు ఉంటాయన్నారు. ఆయా గ్రామాలలోని ప్రజలు ఈ శిబిరాలను వినియోగించుకోవాలని ఆమె కోరారు.