TG: విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ పొందేందుకు ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి అని తెలిసిందే. అయితే ఇకపై రేషన్ కార్డు ఉంటేనే ఆదాయ ధ్రువీకరణ పత్రం వస్తుంది. మీసేవ సెంటర్లలో రేషన్ కార్డులు లేని వారు దరఖాస్తు చేస్తే మిస్సింగ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు అని మెసేజ్ వస్తుంది. ఫీజు రీయింబర్స్మెంట్ అనర్హులు పొందుతున్నారనే ఆరోపణలతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.