RR: చేవెళ్ల మండలం తల్లారం గ్రామానికి చెందిన స్వాతి అనే లబ్ధిదారురాలికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సొంతిల్లు ప్రతి ఒక్కరికి ఓ భరోసా అని, ప్రతి ఒక్కరికి సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు.