YDBNR: చేపల పెంపకం ద్వారా మత్స్యకారుల కుటుంబాల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం చౌటుప్పల్ మండలం లక్కారం చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమానికి హాజరై చెరువులో చేప పిల్లలను వదిలారు. చేపలు వ్యాపారం ద్వారా మత్స్యకారులు పెద్ద వ్యాపారులుగా ఎదగాలని ఆకాంక్షించారు.