PLD: సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా విజయవాడలోని బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ ఇస్తారని ఆదివారం చెప్పారు. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ధ్రువీకరణ పత్రాలను జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో ఈ నెల 25లోగా అందజేయాలన్నారు.