KMM: తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెప్పే ఆకర్షణీయమైన ప్రకటనలకు ఎవరూ మోసపోవద్దని సీపీ సునీల్ దత్ హెచ్చరించారు. టెలిగ్రామ్, ఇమెయిల్ ద్వారా పంపే లింకుల ద్వారా ప్రజలను నమ్మబలికి డబ్బు బదిలీ చేయించుకునే సైబర్ మోసాలు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. వీడియో కాల్, వాట్సాప్ లేదా మెసేజ్ ద్వారా పెట్టుబడి పెట్టమని ఒత్తిడి చేస్తే వెంటనే కాల్ కట్ చేయాలన్నారు.