TPT: సమాజంలో అశాంతిని రేకెత్తిస్తే కఠిన చర్యలు తప్పవని SP సుబ్బరాయుడు హెచ్చరించారు. అలాంటి వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. తిరుచానూరు బ్రహ్మోత్సవాల కోసం తిరుపతికి వస్తున్న రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా పోలీసుల సూచనలను పాటించాలని కోరారు. మీడియా సైతం ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు.