ADB: కార్మికుల సమస్యల పరిష్కారానికి అలుపెరుగని పోరాటం చేస్తామని AITUC అనుబంధం యూనియన్ నాయకులు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి బ్రాంచ్ అధ్యక్షుడిగా నల్ల శివన్నను ప్రధాన కార్యదర్శిగా పెందూర్ దిలీప్‌ను నియమిస్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శి సిర్ర దేవేందర్ వెల్లడించారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని వారు కోరారు.