KNR: భారీ వర్షాల కారణంగా ఆరెపల్లి- జాగీర్పల్లి గ్రామాల మధ్య రోడ్డుపై గుంతలు ఏర్పడి అధ్వానంగా తయారైంది. ఈ మట్టి రోడ్డుపై దొడ్డు కంకరరాళ్లు పైకి తేలి ప్రజలు, వాహనదారులు నిత్యం అనేక అవస్థలు పడుతున్నారు. వెన్నంపల్లి గైచెరువు వద్ద వర్షాకాలం మత్తడి పడి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకొని రోడ్డు వేయించాలన్నారు.