ADB: కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసపూరిత అబద్దాలతో సంక్షోభం నెలకొందని సోషల్ వర్కర్ నిజాముద్దీన్ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని 44వ వార్డు సంజీయ్ నగర్, బుక్తాపూర్,వడ్డెర కాలనీ, డాల్డా కంపెనీ ఏరియాలకు చెందిన 300 మంది నిజాముద్దీన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి జోగు రామన్న బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.