IND A vs SA A మధ్య మూడు మ్యాచ్ల అనధికార వన్డే సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నSA A 30.3 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. రివాల్డో మూన్సామి(33), డెలానో పోట్గీటర్(23), డయాన్ ఫారెస్టర్(22) పరుగులు చేశారు. భారత బౌలర్లలో నిషాంత్ సింధు 4 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా 3, ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లతో రాణించారు.