VZM: ఎస్.కోట నియోజకవర్గంలోని ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి హామీ ఇచ్చారు. ఎస్‌కోట, కొత్తవలస మండలాల్లో ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కార్తీక వనభోజన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవత వాసవి మాత ఉత్సవాలను రాష్ట్ర ఉత్సవాలుగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు.