NZB: బోధన్ మండలం బెలాల్ గ్రామంలోని డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఇవాళ నిర్వహించిన క్రికెట్ టోర్నీని ప్రముఖ సమాజ సేవకురాలు జల్లా అన్నపూర్ణ నీలకంఠం గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువత వ్యసనాలకు దూరంగా ఉంటూ, ప్రణాళికాబద్ధంగా తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. క్రీడలలో యువత తమజీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవచ్చని ఆమె సూచించారు.