భువనగిరి: రాయగిరి వెంకటేశ్వర కాలనీలో వీధి కుక్కల దాడిలో ముఖముల రమేష్ అనే రైతుకు చెందిన మూడు గేదె దూడలు మృత్యువాత పడ్డాయి. గేదె దూడలు చనిపోవడంతో రైతు కన్నీరు పెట్టుకున్నారు. రైతుకు నష్ట పరిహారం చెల్లించి న్యాయం చేయాలని యాదవ సంఘం కుల పెద్ద అవిశెట్టి మల్లేష్, అధ్యక్షుడు మచ్చ రాజు మున్సిపల్ కమిషనర్‌ను కోరారు.