WNP: వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తన తల్లిదండ్రులు కీర్తిశేషులు సాయి రెడ్డి, వెంకటమ్మ జ్ఞాపకార్థంగా ఆదివారం చిట్యాల చేయూత అనాధాశ్రమానికి రూ.6 లక్షల విలువైన వాహనాన్ని విరాళంగా అందించారు. ఈ వాహనాన్ని అనాధ వృద్ధులకు భోజనం పంపిణీ కోసం ఉపయోగిస్తామని అనాధాశ్రమ నిర్వాహకుడు శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. MLA మాట్లాడుతూ.. పేదలకు సాయం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు.