ATP: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా YSR కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమం రాయదుర్గం నియోజకవర్గంలో కొనసాగింది. రాయదుర్గం సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ఆదేశాల మేరకు ఓబుళాపురం గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో యువ నాయకుడు మెట్టు విశ్వనాథ్ రెడ్డి పాల్గొని సంతకాలు సేకరించారు.