VZM: ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు పత్రికలు పని చేయాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. ఆదివారం జాతీయ పత్రికా దినోత్సవాన్ని స్దానిక శ్రీ కళా భారతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిజం పితమహుడు సీ.వై.చింతామణి విగ్రహానికి ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ రాంబార్కి శరత్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు.