BDK: ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన బుల్లెమ్మ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి ఆదివారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు. పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేయడంతో లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన సాధారణ వ్యక్తిగా వారితో కలిసి భోజనం చేశారు.