TG: ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇబ్బందుల్లో పడ్డారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ’85 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకూ కేవలం 5 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే తీసుకున్నారు. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొంటామంటే ఎలా? 11, 12 క్వింటాళ్ల పత్తి పండించిన వాళ్లు మిగతా పంటను ఏం చేయాలి? అని ప్రశ్నించారు.