అమెరికాలో కొత్త రకం వైరస్ కలకలం రేపుతోంది. వాషింగ్టన్కు చెందిన ఓ వ్యక్తి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరాడు. అతడికి వైద్య పరీక్షలు చేయగా.. H5N5 ఏవియన్ ఇన్ఫ్లూయింజా అనే వైరస్ సోకినట్లు గుర్తించారు. ఇటువంటి వైరస్ మానవులకు సోకడం ఇదే తొలిసారని వైద్యులు తెలిపారు. ఈ వైరస్ ఆ వ్యక్తికి ఎలా సోకిందనే విషయాలపై అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు.