SKLM: అరసవెల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాలలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి శ్రీకాకుళంకు చెందిన ఆవాల వెంకట సత్యనారాయణ దంపతులు రూ.లక్ష విరాళం అందజేశారు. ఆదివారం స్థానిక ఆలయానికి చేరుకున్న వారు ఆలయ ఈవో కేఎన్వీడి ప్రసాద్‌కు అందజేశారు. దాత దంపతులను ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆశీర్వదించి స్వామివారి జ్ఞాపికను అందజేశారు.