NLR: ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్ను నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.