ADB: ప్రత్యేక జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి జిల్లా ప్రజల నుండి భారీ స్పందన వచ్చిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ మేరకు ఎస్పీ మాట్లాడుతూ.. లోక్ అదాలత్ కార్యక్రమంలో 3538 కేసులు పరిష్కారం అయినట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. రాజీమార్గమే రాజమార్గం అంటూ జిల్లా ప్రజలు రాజి కుదుర్చుకొని విజయవంతంగా కేసులను పూర్తి చేసుకున్నారని తెలిపారు.