TPT: ఓజిలి మండలం కొండవలపాడు గ్రామంలో పొలం పనులు చేస్తుండగా పురాతన వేంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి, అలివేలు మంగమ్మ విగ్రహాలు బయటపడినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు విగ్రహాలను పరిశీలించారు. అనంతరం వాటి అసలు కాలాన్ని నిర్ధారించేందుకు పురావస్తు శాఖకు సమాచారం పంపించారు.