ATP: గుంతకల్లు ప్రెస్‌క్లబ్‌లో ఇవాళజాతీయ పత్రిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీనియర్ పాత్రికేయులు రఫీ, అయూబ్ మాట్లాడుతూ.. విద్యార్థులు దినపత్రికలు చదవడం ఎంతో ఉపయోగకరమన్నారు. సమాజంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయం దినపత్రికలో వస్తాయన్నారు. ఈ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.