MDK: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం కోళ్ల వ్యాన్ బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున HYD నుంచి మెదక్ వైపు వెళ్తున్న కోళ్ల వ్యాన్ అతివేగంగా వచ్చి ఒక ఆటోను ఢీకొట్టడమే కాకుండా ముందుకు దూసుకెళ్లి 2 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. దీంతో ఆటోతోపాటు రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది.