SRD: మండల కేంద్రమైన సిర్గాపూర్‌లో ప్రభుత్వ బాలుర వసతి గృహం ఆధ్వర్యంలో ఆదివారం సంక్షేమ శాఖ వనభోజనం నిర్వహించారు. వార్డెన్ కిషన్ నిర్వహణలో స్థానిక హాస్టల్ పక్కన ఖాళీ ప్రదేశంలో విద్యార్థులకు వనభోజనం నిర్వహించారు. ఈ మేరకు చికెన్ బిర్యాని, బట్టర్ మిల్క్, సాంబార్, స్వీట్ వంటకాలను ఆరగించారు. అనంతరం విద్యార్థులకు ఆట పాటలు, వినోద కార్యక్రమాలు చేపట్టారు.