ATP: శింగనమల నియోజకవర్గం దుగ్గిమర్రి గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి కె. కుసుమ ప్రపంచంలోనే ఎత్తైన ఫ్రీ స్టాండింగ్ పర్వతం ‘కిలిమంజారో’ (5,895 మీటర్లు)ను అధిరోహించి గర్వకారణంగా నిలిచింది. ఈ నెల 12న శిఖరంపై ఆమె భారత జాతీయ జెండాను ఎగురవేశారు. రాష్ట్ర, దేశ కీర్తిని చాటిన కుసుమను పలువురు రాజకీయ ప్రముఖులు అభినందించారు.