WNP: కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం వచ్చినా ధాన్యం కొనుగోలు చేయడం లేదని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీరామ్ అన్నారు. కేతేపల్లి కేంద్రాన్ని సందర్శించిన ఆయన ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయకుంటే రైతులను కలుపుకొని ధర్నా చేస్తామని హెచ్చరించారు. పీఏసీఎస్, ఐకేపీ కేంద్రాలను ఇంకా ప్రారంభించకపోవడం విచిత్రమని పేర్కొన్నారు.