HYD: హైదరాబాద్కు భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ చేరుకున్నారు. ఆయనకు బేగంపేట ఎయిర్ పోర్ట్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. కాగా, ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ‘రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్’ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి పాల్గొననున్నారు.