WGL: ఖిలా వరంగల్ వాకింగ్ గ్రౌండ్లో ఇవాళ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్నికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కొండా సురేఖను సంఘం నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ.. పద్మశాలీల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నేతలు ఉన్నారు.