కృష్ణా: కౌతవరం గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఆదివారం చేపట్టారు. ఏపీలో 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయని, 2,360 మెడికల్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వైసీపీ నేత శశిభూషణ్ అన్నారు. 2019లో జగన్ సీఎం అయిన తర్వాత కేంద్రంతో మాట్లాడి, రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారని చెప్పారు. చంద్రబాబు ఒక మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదని ఎద్దేవ చేశారు.