KMM: సత్తుపల్లి (M) తాళ్లమడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ ఇవాళ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి రైస్ ఇండస్ట్రీస్‌ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీస్ యజమాని పాకాల పాటి శ్రీనుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాం(రైస్)ను అందించాలని యాజమాన్యానికి దయానంద్ సూచించారు. వారితో పాటు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.