నల్గొండ జిల్లాలో బస్ స్టాప్ల వద్ద, రిక్వెస్ట్ స్టాప్ల వద్ద బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆపాల్సిన స్టేజీల్లో బస్సు ఆపకుండా కొందరు కండక్టర్లు, డ్రైవర్లు ముప్పుతిప్పలు పెడుతున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు ఆపడం లేదని ప్రశ్నించే ప్రయాణికులతో సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.