తిరుపతి తాతయ్య గుంటకు చెందిన శేఖర్ (32), శివ (35), నరేష్ (36) ముగ్గురు రేణిగుంట మండలంలోని మల్లెమడుగు రిజర్వాయర్‌కు ఈత కోసం వెళ్లారు. ఉదయం 9 గంటలకు నీటిలో దిగిన శివ లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోతుండగా, కాపాడేందుకు దూసుకెళ్లిన నరేష్ కూడా మునిగిపోయాడు. దీంతో శేఖర్ రేణిగుంట పోలీసులకు సమాచారం అందజేశాడు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.