సత్యసాయి: హిందూపురంలో YCP కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించేందుకు, పార్టీ ఆదేశాల మేరకు మాజీ మంత్రి, సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ హిందూపురం బయలుదేరారు. అయితే, మార్గమధ్యంలోనే ఆమెను, ఇతర వైసీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. హిందూపురం వెళ్లకుండా వారిని నిలిపివేశారు. దీంతో పోలీసుల తీరును వారు ఖండించారు.