HYD: మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని HYD MNJ వైద్యులు తెలిపారు. రొమ్ములో గడ్డ కనిపించడం, చనుమోన నుంచి రక్తం లేదా స్రావాలు రావడం, చనుమున లోపలకి పోవడం, ఆకృతి మార్పులు, గజ్జల్లో వాపు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 40 ఏళ్లు దాటిన మహిళలు ప్రతి సంవత్సరం మామోగ్రామ్ చేయించుకోవాలని ప్రొ. రఘునాథ్ రావు సూచించారు.