సత్యసాయి: హిందూపురంలోని వైసీపీ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించేందుకు వెళ్తున్న కదిరి నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ బీఎస్ మక్బూల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హిందూపురం వెళ్తున్న మక్బూల్‌ను మార్గమధ్యలో లేపాక్షి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు నిలిపివేశారు. ఆ తర్వాత అరెస్టు చేసి లేపాక్షి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అరెస్టును వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు.