SKLM: ఎచ్చర్లలో ఉన్న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ 5వ సెమిస్టర్ రెగ్యులర్, ఆరవ సెమిస్టర్ సప్లమెంటరీ డిగ్రీ పరీక్షల టైం టేబుల్ ను విడుదల చేసినట్లు డిగ్రీ ఎగ్జామినేషన్ డీన్ పద్మారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 25 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఆయా కళాశాలను సంప్రదించాలని సూచించారు.