NZB: నిజాంసాగర్ ప్రాజెక్టు ఖరీఫ్ సీజన్ లో 80 రోజులకు పైగా నిరాటంకంగా కొనసాగుతుంది. ఆదివారం ఉదయం ప్రాజెక్ట్ జలాశయంలోకి 2498 క్యూసెక్కుల వరద నీరు వస్తుందని ఎఈ సాకేత్ తెలిపారు. వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్ట్ నుంచి ఒక గేటు ద్వారా మంజీరా నదికి నీరు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 1405 అడుగుల మెయింటైన్ చేస్తూ నీరు విడుదల చేస్తున్నారు.