ADB: తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని మాజీ ఎంపీ రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలన్నారు. ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో ఉన్న నాగోబా ఆలయ అభివృద్ధిపై చర్చించినట్లు వెల్లడించారు.