W.G: ఆరోగ్యకరమైన బాల్యంతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు పోషకాహారం అత్యంత ముఖ్యమని ప్రముఖ వైద్యులు చైతన్య వర్మ, మానస శ్రావ్య పేర్కొన్నారు. జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరంలోని మదర్ నెస్ట్ హాస్పిటల్లో ఆదివారం చిన్నారులకు ప్యాషన్ షో, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు.