MDK: చిన్న శంకరంపేట్ మండలంలోని అంబాజీపేట గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు తీరును దగ్గరుండి పరిశీలించారు. కొనుగోలు చేసిన వెంటనే ధాన్యాన్ని రైస్ మిల్లుకు తరలించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని సూచించారు.