BHPL: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో కార్తీకమాసాన్ని పురస్కరించుకొని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ సెలవు కావడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. భక్తజనం కుటుంబ సమేతంగా వచ్చి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారికి మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదలు స్వీకరించారు.