SRD: బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణం కొత్త బస్టాండ్ ముందు ఆదివారం న్యాయ సాధన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఛైర్మన్ ప్రభు గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున్ పటేల్, కృష్ణ, శ్రీధర్, సాయి బాషా పాల్గొన్నారు.