ఢిల్లీ పేలుడుకు ముందు బాంబర్ డా. ఉమర్ హర్యానా నూహ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పేలుడుకు 10 రోజుల ముందే హిదాయత్ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకున్నట్లు తెలిపారు. నవంబర్ 10న అర్థరాత్రి ఒంటిగంట సమయంలో అతడు తన i20 కారులో పేలుడు పదార్థాలను తీసుకుని బయల్దేరాడు. ఎరువులను కొనుగోలు చేయటానికి వివిధ అక్రమ మార్గాల్లో రూ.20 లక్షల వరకు సేకరించినట్లు చెప్పారు.