VKB: రాష్ట్ర వ్యాప్తంగా పత్తి మిల్లుల యాజమాన్యం సమ్మె నిర్వహిస్తున్న నేపథ్యంలో వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని పత్తి కొనుగోలు కేంద్రాల్లో ఈనెల 17 నుంచి కొనుగోలు నిలిపివేస్తున్నట్టు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఫసియుద్దిన్ తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించి మిల్లుల వద్దకు పత్తిని తీసుకురావద్దని ఆయన సూచించారు.